కలం, వెబ్ డెస్క్: ఏపీలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు భారీగా తగ్గాయని ఆయన మండిపడ్డారు. 2023-24తో పోలిస్తే 2025-26లో ప్రభుత్వ పాఠశాలల్లో 5,56,666 మంది విద్యార్థులు తగ్గారని, ప్రభుత్వ పాఠశాలల సంఖ్య 45 వేల నుంచి 44,222కు పడిపోయిందని తెలిపారు. ఇదే సమయంలో ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు 991 నుంచి 797కు తగ్గాయని, ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగిందని పేర్కొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగిందన్న కూటమి ప్రభుత్వ వాదనకు UDISE గణాంకాలు విరుద్ధంగా ఉన్నాయని జగన్ విమర్శించారు. నాణ్యమైన ప్రభుత్వ విద్యను కూటమి ప్రభుత్వం బలహీనపరుస్తోందని జగన్ ఆరోపించారు.

