భద్రాద్రి ఆలయ అభివృద్ధి పనుల్లో నో కాంప్రమైజ్.. ఎమ్మెల్యే కీలక ఆదేశాలు

కలం, ఖమ్మం బ్యూరో : భద్రాచలం (Bhadrachalam) శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థాన అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోతే సహించేది లేదని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు అన్నారు. పనులన్నీ వేగవంతం చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను, కాంట్రాక్టర్లను తీవ్రంగా హెచ్చరించారు. భద్రాచలం రామాలయంలో కొనసాగుతున్న పలు అభివృద్ధి పనులను శనివారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.

​ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన భద్రాద్రి క్షేత్రానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారని, వారందరికీ మెరుగైన సౌకర్యాలు కల్పించడమే తమ ప్రధాన ధ్యేయమని అన్నారు. ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న నిర్మాణ పనుల పురోగతిని పర్యవేక్షిస్తూ, నిర్దేశిత గడువులోగా పనులను పూర్తి చేయాలని సూచించారు. నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడేది లేదని, భక్తుల అసౌకర్యానికి కారణమైతే కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఈ పర్యవేక్షణ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, యూత్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>