బాలికల ఆశ్రమ పాఠశాలలో సమస్యల పరిశీలన

కలం, నిర్మల్: సారంగాపూర్ (Sarangapur) మండలం స్వర్ణ గ్రామంలోని ప్రభుత్వ బాలికల ఆశ్రమ పాఠశాలను తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం నిర్మల్ జిల్లా కార్యదర్శి తొడసం శంభు శనివారం సందర్శించారు. విద్యార్థినులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమైన ఇప్పటివరకు స్కూల్ యూనిఫాంలు అందలేదని శంభు అన్నారు. హాస్టల్ గ్రౌండ్‌లోని సోలార్ ల్యాంప్ కొన్నేళ్లుగా పనిచేయడం లేదన్నారు. దీంతో రాత్రి వేళ కరెంట్ సరఫరా నిలిచినప్పుడు హాస్టల్ పరిసరాల్లో చీకటి అలుముకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే యూనిఫాంలు అందించి, సోలార్ ల్యాంప్‌‌కు మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, అవసరమైన చోట అదనపు లైటింగ్ ఏర్పాటు చేయాలని కూడా అధికారులను కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>