నిర్మల్ జిల్లా కోర్టులో హైకోర్టు జడ్జి తనిఖీలు

కలం, నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రధాన కోర్టుని (Nirmal Court) హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.సుజన శనివారం తనిఖీ చేశారు. జిల్లా పోక్సో కోర్టును కూడా సందర్శించారు. కోర్టులో రికార్డులను పరిశీలించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిర్మల్ రూరల్ మండలం రాణాపూర్ శివారులో నూతనంగా నిర్మిస్తున్న కోర్టు భవన సముదాయ పనులను పరిశీలించి, పురోగతిని సమీక్షించారు.

అంతకుముందు అటవీ శాఖ అతిథి గృహానికి చేరుకున్న జస్టిస్ కె.సుజనకు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శ్రీవాణి, భైంసా ఏఎస్పీ సాయి కిరణ్, నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్ పుష్పగుచ్ఛాలు అందించి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు రాధిక, రవీందర్, నిఖిత, భవిష్య, చీఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ చంద్రమోహన్, సీనియర్ సూపరింటెండెంట్ రాజారాం తదితరులు పాల్గొన్నారు.

Also Read : మంత్రి కొండా సురేఖ సంచలన లేఖ

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>