నిధులు తీసుకురావడంలో బీజేపీ విఫలం: మంత్రి పొన్నం

కలం, మెదక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల సాధనలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం పూర్తిగా విఫలమైందని బీసీ, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధికి అడ్డంకులు సృష్టిస్తున్న కేంద్రాన్ని ప్రశ్నించే ధైర్యం ఇక్కడి బీజేపీ నేతలకు లేదా అని ప్రశ్నించారు. ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా అక్కన్నపేటలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడుల సేకరణే ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడం నిరంకుశత్వానికి నిదర్శనమని విమర్శించారు.

తెలంగాణ అభివృద్ధి చెందితేనే..

తెలంగాణ అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ప్రధాని పేర్కొనే ‘వికసిత్ భారత్’ లక్ష్యం నెరవేరాలంటే ప్రతి రాష్ట్రం పురోగమించాలన్నారు. ‘తెలంగాణ రైజింగ్ 2047’ లక్ష్య సాధనలో కేంద్రం భాగస్వామి కావాలని కోరారు. మెట్రో రైల్ విస్తరణ, ఔటర్ రింగ్ రోడ్, ఇంటర్నల్ రేడియల్ రింగ్ రోడ్లతో పాటు ఇతర మౌలిక వసతుల కల్పనకు కేంద్ర నిధులు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయాలను పక్కన పెట్టి, తెలంగాణ ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని పొన్నం కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>