ఆయిల్ పామ్ సాగుతో అధిక ఆదాయం: హరీశ్ రావు

కలం, మెదక్ బ్యూరో: ఆయిల్ పామ్ సాగుతో అధిక ఆదాయం పొందవచ్చని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) రైతులకు సూచించారు. బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి సిద్దిపేట నియోజకవర్గంలోని నర్మెట్టలో ఉన్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని సందర్శించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. కాళేశ్వరం జలాలు ఈ ప్రాంతానికి రావడంతోనే ఆయిల్ పామ్ సాగు మొదలైందన్నారు. వాటిని సాగు చేసిన రైతులు, లాభాలు పొందుతుంటే ఎంతో సంతోషంగా ఉందన్నారు.

నర్మెట్ట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ అతి తక్కువ కాలంలో 60 మెట్రిక్ టన్నుల క్రషింగ్ సామర్థ్యానికి చేరుకోవడం ఎంతో అభినందనీయమైన విషయమని హరీశ్ రావు అన్నారు. రైతులు ఆయిల్ పామ్ సాగు చేసుకోవాలని, నర్సరీలో మొక్కలు కూడా అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. అంతేగాకుండా, ఇదే ఫ్యాక్టరీలో రిఫైనరీ కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు వివరించారు. ఇందుకు సంబంధించిన పనులను వెంటనే ప్రారంభించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>