కలం, వెబ్ డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రతిపక్ష నేత కేసీఆర్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Alleti Maheshwar Reddy) ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలను చర్చించే దమ్ము ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు. ప్రతిపక్షానికి కూడా సభలో మాట్లాడే ఉద్దేశ్యం లేదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మిత్రపక్షాలుగా మారిపోయాయని ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన అసెంబ్లీ ప్రాంగణంలో మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
శీతాకాల అసెంబ్లీ సమావేశాలను రెండు మూడు రోజుల్లో ముగించాలని ప్రభుత్వం భావిస్తున్నదని మహేశ్వర్ రెడ్డి (Alleti Maheshwar Reddy) ఆరోపించారు. ప్రతిపక్షాలు ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పే దైర్యానికి లేదని పేర్కొన్నారు. అసెంబ్లీలో ఏ విషయమైనా చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారని కానీ ఎక్కువ రోజులు సభ ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు.
Read Also: మహిళలకు ఉచిత డ్రైవింగ్ శిక్షణ
Follow Us On: X(Twitter)


