రూ.15 వేల కోట్ల ఫీజు బకాయిలు.. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే ఏలేటీ ఫైర్!

కలం, నిర్మల్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తోందని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే (Nirmal MLA) ఏలేటి మహేశ్వర్ రెడ్డి (MLA Alleti Maheshwar Reddy) విమర్శించారు. శనివారం హైదరాబాద్‌‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ‘ఫీజుల బకాయి – బీజేపీ లడాయి’ పేరుతో చేపట్టనున్న రెండు రోజుల నిరాహార దీక్షకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే (MLA Alleti) మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు గడుస్తున్నా రాష్ట్రానికి ఇప్పటివరకు పూర్తిస్థాయి విద్యాశాఖ మంత్రి లేకపోవడం సిగ్గుచేటని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యా వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

రాష్ట్రంలో సుమారు 2,120 ప్రభుత్వ పాఠశాలలు శిథిలావస్థకు చేరుకున్నాయని, 1,752 పాఠశాలల్లో బాలికలకు కనీస మరుగుదొడ్డి సౌకర్యాలు కూడా లేవని తెలిపారు. విద్యారంగానికి తగినన్ని నిధులు కేటాయించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. ప్రభుత్వ ఖజానాపై భారం మోపే విహార యాత్రలు మానుకుని విద్యార్థుల సమస్యలపై దృష్టి సారించాలని సూచించారు.

రాష్ట్రంలో సుమారు రూ. 15 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోయాయని, దీంతో 14 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు గందరగోళంలో పడిందని అన్నారు. పెండింగ్‌‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఫీజు బకాయిలపై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ఆధ్వర్యంలో 48 గంటల నిరాహార దీక్ష చేపడుతున్నట్లు తెలిపారు.

ఈ దీక్షలో బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొని విద్యార్థులకు మద్దతుగా నిలుస్తారని చెప్పారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పూర్తిగా చెల్లించే వరకు విద్యార్థుల పక్షాన బీజేపీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.

Also Read : ఆ రెండు భేటీలు అడ్డంకిగా మారాయా? అందుకే సీఎంకు పర్మిషన్ ఇవ్వలేదా!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>