కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad)లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti) పర్యటనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మంత్రి పొంగులేటి నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ బీజేపీ నేతలు ఆధ్వర్యంలో పొంగులేటి పాల్గొన్న కార్యక్రమం వద్దకు వచ్చారు. 22ఏ భూముల వ్యవహారానికి బాధ్యత వహిస్తూ పొంగులేటి మంత్రి పదవికి రాజీనామా చేయాలని నినాదాలు చేశారు.
దీంతో ఆందోళనకారులను కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. పోలీసులు కూడా వారిని కట్టడి చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు సైతం మోడీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. పోటాపోటీ నినాదాల నడుమ ఇరువర్గాల నడుమ ఘర్షణ వాతావరణం నెలకొనడంతో తోపులాట చోటుచేసుకుంది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ సహా బీజేపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి మాక్లూర్ పోలీసు స్టేషన్ కు తరలించారు.
Also Read : యూపీ సీఎం యోగితో బండి సంజయ్ భేటీ.. తెలంగాణ రాజకీయాలపై చర్చ..!
Follow Us On: X(Twitter)

