కలం, వెబ్ డెస్క్: తెలంగాణ అసెంబ్లీలో సోమవారం ఆసక్తికర పరిణామం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ప్రతిపక్షనేత కేసీఆర్ (KCR) సభకు రావడం.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆయన కూర్చున్న సీటు దగ్గరకు వెళ్లి పలుకరించడం, క్షేమ సమాచారం అడగటం తెలిసిందే. సోషల్ మీడియాలో ఈ వీడియోలు, ఫొటోలు బాగా వైరల్ అవుతున్నాయి.
అయితే ఇదే సమయంలో సభలో ఉన్న కేటీఆర్ (KTR) వైఖరి మీద తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కేసీఆర్ను సీఎం రేవంత్ రెడ్డి పలుకరించేందుకు వచ్చిన సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా మర్యాదపూర్వకంగా లేచి నిలబడ్డారు. కేసీఆర్ లేచి నిలబడి రేవంత్ రెడ్డికి ప్రతి నమస్కారం చేయడంతో మిగిలిన ఎమ్మెల్యేలు సైతం మర్యాద పూర్వకంగా లేచి నిలబడ్డారు.
అదే సమయంలో కాస్త వెనుకసీట్లో కూర్చున్న కేటీఆర్ (KTR), మరో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాత్రం సీటులో కూర్చొనే ఉన్నారు. దీంతో కేటీఆర్కు ఇంత అహంకారం అవసరమా? అంటూ కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. ముఖ్యమంత్రికి గౌరవం ఇవ్వకపోయినా తన తండ్రికి గౌరవం ఇచ్చి అయినా కేటీఆర్ నిలబడి ఉండొచ్చు కదా అని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. అయితే బీఆర్ఎస్ నేతలు మాత్రం కేసీఆర్ను చావాలని కోరుకున్న రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు కేటీఆర్ నిలబడాల్సిన అవరం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇలా మొదటి రోజు అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకున్నది.
Read Also: దివ్యాంగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్న్యూస్
Follow Us On: Pinterest


