కలం, నిర్మల్ : పాలిటెక్నిక్ విద్యను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ నంబర్ 97ను వెంటనే రద్దు చేయాలని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం నిర్మల్ జిల్లా కేంద్రంలో బీజేవైఎం (Nirmal BJYM) ఆధ్వర్యంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. కళాశాల నుంచి శివాజీ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం రోడ్డుపై మానవహారం చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేసేందుకు తీసుకొచ్చిన జీఓ నంబర్ 97తో విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన శక్తి స్కీమ్ వల్ల విద్యార్థుల మూడేళ్ల విద్యాభ్యాసం వృథా అయ్యే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే జీఓను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం నాయకులు, పాలిటెక్నిక్ విద్యార్థులు పాల్గొన్నారు.

