నిర్మల్ పోలీస్ సిబ్బందికి వీక్లీ పరేడ్.. క్రమశిక్షణ, ఫిట్‌నెస్‌పై ఫోకస్!

కలం, నిర్మల్: పోలీస్ శాఖలో క్రమశిక్షణ, శారీరక దృఢత్వం ఎంతో ముఖ్యమని పోలీస్ అధికారులు పేర్కొన్నారు. శనివారం నిర్మల్ జిల్లా పోలీస్ శాఖ (Nirmal Police) ఆధ్వర్యంలో వివిధ సబ్‌ డివిజన్లు, సర్కిళ్ల పరిధిలోని పోలీస్ సిబ్బందికి వీక్లీ పరేడ్ (Weekly Parade) నిర్వహించారు. నిర్మల్ రూరల్, భైంసా టౌన్, ఖానాపూర్ పోలీస్ స్టేషన్లలో నిర్వహించిన పరేడ్‌‌లో అధికారులు సిబ్బంది డ్రిల్‌‌ను పరిశీలించారు.

వీక్లీ పరేడ్‌తో సిబ్బందిలో క్రమశిక్షణ, సమన్వయం, ఫిట్‌నెస్ పెంపొందుతాయని అధికారులు తెలిపారు. విధినిర్వహణతో పాటు ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని, క్రమం తప్పకుండా వ్యాయామం, ఆరోగ్య పరీక్షలు చేసుకోవాలని సూచించారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బైంసా ఏఎస్పీ సాయికిరణ్, నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్, సీఐలు కృష్ణ, గోవర్ధన్ రెడ్డి, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>