కలం, వెబ్ డెస్క్ : ఖమ్మం జిల్లాలో విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రఘునాథపాలెం (Raghunadhapalem) పోలీస్ స్టేషన్ సమీపంలో అతివేగంగా వచ్చిన ఒక కారు, బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు తీవ్ర గాయపాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
మృతులను గుండెటి శ్రీను, గార్లపాటి రిషికగా పోలీసులు గుర్తించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.

