మానసిక వికలాంగుల స్కూల్‌ను సందర్శించిన వీసీ ఉమేష్

కలం, కరీంనగర్: జిల్లాలోని తిమ్మాపూర్ మండలం మహాత్మా నగర్ గ్రామపంచాయతీ పరిధిలోగల జిల్లా స్వాతంత్ర్య సమరయోధుల ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న మానసిక వికలాంగుల ప్రత్యేక పాఠశాలను శుక్రవారం శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ ప్రొఫెసర్ ఉమేష్ కుమార్ (VC Umesh Kumar) సందర్శించారు. ట్రస్ట్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి ని కలిసి పాఠశాల నిర్వహణ, విద్యార్థుల సంరక్షణ, విద్యా బోధన గురించి అడిగి తెలుసుకున్నారు. మొదటిసారి పాఠశాలకు విచ్చేసిన వైస్ ఛాన్స్ లర్ ప్రొఫెసర్ ఉమేష్ కుమార్ కు పాఠశాల తరఫున చైర్మన్ వెంకటరెడ్డి శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు.

ఈ సందర్భంగా వీసీ ప్రొఫెసర్ ఉమేష్ కుమార్ మాట్లాడుతూ.. మానసిక వికలాంగుల పాఠశాలలను నడపడం అంటే ఓపికతో కూడుకున్న పని అని అన్నారు. మారుతున్న కాలంలో మానసిక వైకల్యం ఉన్న పిల్లలను సంరక్షించడంలో తల్లిదండ్రులు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. అలాంటి వారిని చదివించడం కోసం వారికి ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ లాంటివి చేపించడం, వృత్తి విద్య నైపుణ్యాన్ని పెంపొందించడం హర్షించదగ్గ విషయమని కొనియాడారు.

పాఠశాల అధ్యాపకుల, ఆయాల ధైర్యాన్ని ఓపిక తత్వాన్ని అభినందించడంలో ఏమాత్రం సందేశించాల్సిన అవసరం లేదని పాఠశాల నిర్వహణ కోసం ట్రస్ట్ చైర్మన్ వెంకట రెడ్డి, సభ్యుల కృషి అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్,మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి, ప్రిన్సిపల్ సతీష్,అడ్మినిస్ట్రేటర్ బాల్ రాజ్,సింగిల్ విండో డైరెక్టర్ చాడ శ్రీధర్ రెడ్డి,పాఠశాల అధ్యాపకులు,సిబ్బంది రమేష్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>