కలం, వెబ్ డెస్క్ : రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సాన డైరెక్షన్ లో వస్తున్న మూవీ పెద్ది (Peddi). భారీ బడ్జెట్ తో విలేజ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా పెద్ద నటుల పోస్టర్లు వచ్చేశాయి. తాజాగా సీనియర్ నటుడు జగపతి బాబు (Jagapathi babu) లుక్ రిలీజ్ చేశారు. ఇందులో ఆయన అప్పలసూరి అనే పాత్రలో నటిస్తున్నాడు. అయితే లుక్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంది. అసలు ఇతను జగపతి బాబేనా అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఎందుకంటే అస్సలు గుర్తుపట్టలేని విధంగా ఉంది ఆయన గెటప్. చాలా ఓల్డేజ్ లుక్ లో.. పాతబట్టలు వేసుకుని.. కండ్లజోడు పెట్టుకుని కనిపిస్తున్నాడు.
దీనావస్థ స్థితిలో ఉన్న వ్యక్తిలాగా ఆయన ఎక్స్ ప్రెషన్లు ఉన్నాయి. మొత్తంగా ఆయన లుక్ బాగానే ఆకట్టుకుంటోంది. ఇందులో ఆయన నెగెటివ్ పాత్ర చేస్తున్నారా లేదా వేరే పాత్రనా అనేది ఇంకా తెలియదు. ఆమని ఆయనకు జంటగా నటిస్తున్నట్టు సమాచారం. 2026 మార్చి 27న మూవీ రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలోనే వరుసగా పెద్ది (Peddi) నుంచి ఏదో ఒక అప్డేట్ ఇస్తూ హైప్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్. రీసెంట్ గానే శివరాజ్ కుమార్ లుక్ రిలీజ్ అయింది. ఇక నుంచి వరుస అప్డేట్లు ఉంటాయని తెలుస్తోంది.
Read Also: సందీప్ న్యూ ఇయర్ బ్లాస్ట్.. ‘స్పిరిట్’ నుంచి ప్రభాస్ ఫ్యాన్స్‌కు గ్రాండ్ సర్ప్రైజ్!
Follow Us On: Youtube


