కలం, వెబ్ డెస్క్ : ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూసిన ది రాజాసాబ్ (Raja Saab) తాజాగా ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ లో హీరోయిన్స్ కు సంబంధించిన సీన్లను పూర్తిగా పక్కన పెట్టేశారు. ప్రభాస్ యాక్షన్, దెయ్యం సీన్లను హైలెట్ చేశాడు మారుతి(Director Maruthi). వీఎఫ్ ఎక్స్ బాగానే కుదిరినట్టు అనిపిస్తోంది. ప్రభాస్ నానమ్మ చుట్టూ కథ తిరుగుతున్నట్టు కనిపిస్తోంది. ఆమె గతంలో మహారాణిగా చూపించారు. సంజయ్ దత్ ను భయంకరమైన దెయ్యంగా చూపించే ప్రయత్నం చేశాడు మారుతి. పాత కోటలో కొన్ని దెయ్యం సీన్లను ట్రైలర్ లో చూపించారు. అవి బాగానే ఆకట్టుకుంటున్నాయి. మన టైమ్ స్టార్ట్ అయింది అని ప్రభాస్ చెప్పిన డైలాగ్ ను బట్టి ది రాజాసాబ్ కథలో కొన్ని ట్విస్టులు ఉంటాయని తెలుస్తోంది.
మొసలితో ఫైట్, సంజయ్ దత్ తో ప్రభాస్ (Prabhas) యాక్షన్, లాస్ట్ లో వయసైపోయిన గెటప్ లో ప్రభాస్ ఇవన్నీ బాగానే ఉన్నాయి. లాస్ట్ లో ప్రభాస్ లుక్ చేంజ్ చేసుకోవడం చూపించాడు. దాన్ని బట్టి చూస్తే ప్రభాస్ శరీరంలో కూడా ఆత్మ చొచ్చిన తర్వాత క్లైమాక్స్ ఉంటుందని అర్థమవుతోంది. ఇందులో వీఎఫ్ ఎక్స్ గురించే ప్రధానంగా చెప్పాలి. వీఎఫ్ ఎక్స్ ఇందులో బాగానే వర్క్ఔంట్ అయింది. సీన్లకు తగ్గట్టు బాగానే కుదిర్చాడు మారుతి. మరి సినిమా (Raja Saab) ఎలా ఉంటుందో చూడాలి.
Read Also: డైరెక్టర్ ఆఫ్ ది ఇయర్‌గా అనిల్ రావిపూడి
Follow Us On: Youtube


