ఖమ్మం కలెక్టరేట్ ముట్టడికి TG JAC పిలుపు!

కలం, ఖమ్మం బ్యూరో: ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం టీజీ జేఏసీ (TG JAC) ఆధ్వర్యంలో ఈనెల 27న ఖమ్మం కలెక్టరేట్ ముట్టడి జరగనుంది. ఈ సందర్భంగా టీఎస్ యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి డీఎస్ నాగేశ్వరరావు మాట్లాడుతూ.. మహాధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గురువారం ఏన్కూరు మండలంలో జరిగిన ఉపాధ్యాయ సంఘాల సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ​గత జూన్ 2న సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినప్పటికీ, రెండు నెలలైనా ప్రధాన డిమాండ్లు నెరవేరలేదని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే ఈహెచ్‌ఎస్ పథకాన్ని అమలు చేయాలన్నారు. రెండవ పీఆర్‌సీ నివేదికను ప్రకటించి, పెండింగ్ 6 డీఏలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ వర్తింపజేయాలని, జీవో 25ను సవరించి బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ ఇవ్వాలని కోరారు. ​ఆగస్టు 27న జిల్లా ధర్నాలు, సెప్టెంబర్ 1న నల్ల బ్యాడ్జీలతో నిరసనలు, సెప్టెంబర్ 10న హైదరాబాద్ మహాధర్నా చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎంలు రహీం బీ, వాసవి దేవి, సుజాత, టీచర్లు శ్రీదేవి, రమేశ్, రామారావు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>