కలం, వెబ్‌డెస్క్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కునో (Kuno) నేషనల్ పార్క్‌లో చీతాల ప్రాజెక్ట్ (Project Cheetah) కింద మరో చారిత్రాత్మక మైలురాయి నమోదైంది. భారత్‌లోనే జన్మించిన 32 నెలల ఆడ చీతా KJP21 తాజాగా ఐదు ఆరోగ్యవంతమైన పిల్లలకు జన్మనిచ్చింది. ముఖి, కేజీపీ12 తర్వాత అత్యధిక పిల్లలకు జన్మనిచ్చిన మూడో భారతీయ ఆడ చీతాగా KJP21 నిలిచింది. దీంతో దేశంలో చీతాల సంఖ్య 60కి చేరుకుంది. ఈ ఐదు పిల్లలతో భారత్‌లోనే జన్మించిన చీతాల సంఖ్య 41కి పెరిగింది.
తాజాగా జన్మించిన ఈ ఐదు పిల్లలు బోట్స్వానాకు చెందిన మగ చీతా వల్ల పుట్టాయి. దీని ద్వారా భారతదేశంలో బోట్స్వానా వంశానికి చెందిన కొత్త జన్యు వంశం ఆరంభమైంది. భారత్ లో మరో తరానికి చెందిన చీతాలు జన్మించడం ప్రాజెక్ట్ చీతా విజయానికి అద్దం పడుతోందని అధికారులు తెలిపారు. ఈ అద్భుత విజయం వెనుక నిరంతరం శ్రమిస్తున్న వెటర్నరీ వైద్యులు, ఫీల్డ్ సిబ్బంది, మేనేజర్లు, ప్రాజెక్ట్ చీతా బృందానికి సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ చిరుతలకు సంబంధించిన వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Also Read : సర్ వివాదం.. కాంగ్రెస్ మూడు డిమాండ్లు ఇవే!
Follow Us On: Instagram

