ఆందోళనలో సినిమా ఇండస్ట్రీ.. పవన్ కళ్యాణ్​‌తో మీటింగ్!

కలం, వెబ్ డెస్క్: డీప్ ఫేక్ వీడియోలతో సినిమా ఇండస్ట్రీ తీవ్ర ఆందోళనలో ఉంది. త్వరలోనే పరిశ్రమ పెద్దలు, పలువురు హీరోలు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ (Pawan Kalyan)తో సమావేశం కాబోతున్నారు. ఈ విషయాన్ని నిర్మాత నాగవంశీ ధ్రువీకరించారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. మార్ఫింగ్ వీడియోలు చేస్తూ నటుల గౌరవానికి భంగం కలిగించేవారిపై కఠిన చర్యలు తీసుకునేలా అవసరమైన కొత్త చట్టాలు, నిబంధనలు తీసుకురావాలని కోరబోతున్నట్లు సమాచారం.

స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్‌(Janhvi Kapoor)ను అత్యంత అసభ్యకరంగా వీడియో మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలోకి వదిలిన కేటుగాళ్ల భరతం పట్టాలని ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ ఎక్స్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. దీనిపై ఇప్పటికే హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

ఇండస్ట్రీకే ఇది హెచ్చరిక: మంచు విష్ణు

డీప్ ఫేక్ వీడియోలు (Deepfake Video) మొత్తం ఇండస్ట్రీకే ఒక హెచ్చరిక లాంటిదని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు (Manchu Vishnu) అన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నవారి వివరాలను ఇప్పటికే సేకరిస్తున్నట్లు తెలిపారు. పరిశ్రమలోని అన్ని విభాగాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి వ్యక్తి సోషల్ మీడియా ఖాతాలను ఆధార్ కార్డుతో అనుసంధానం చేయాలనే అంశంపై మరింత చర్చ జరగాలన్నారు. డీప్ ఫేక్, ఏఐ నెగిటివిటీని ఎదుర్కోవడానికి ఒక శాశ్వత వ్యవస్థ రూపొందించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఈ విషయంలో ‘మా’ నిరంతరం పనిచేస్తోందన్నారు.

Also Read : కునోలో చిరుత కూన‌ల సంద‌డి!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>