హరియాణా(Haryana)లో దారుణ ఘటన చోటు చేసుకుంది. సర్వీస్ రివాల్వర్‌తో పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో షూట్ చేసుకుని ఓ ఎస్‌ఐ ఆత్మహత్య చేసుకున్నాడు. సందీప్(Sandeep Lather) అనే ఎస్ఐ.. సైబర్ డిపార్ట్‌మెంట్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల మరణించిన సీనియర్ ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్‌పై అవినీతి ఆరోపణలు చేసిన అంశంలో సందీప్ కీలకంగా మారారు. ఆ వ్యక్తి ఇప్పుడు ఒక్కసారిగా ఆత్మహత్యకు పాల్పడంతో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. సందీప్‌ను ఎవరైనా ఒత్తిడి చేశారా? ఎవరైనా బెదిరింపులకు పాల్పడ్డారా? అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం. అసలు సందీప్ ఆత్మహత్యకు కారణం ఏంటి? అన్న దానిపై ఫోలీసులు ఫుల్ ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే సందీప్ ఫోన్ డాటాను పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Read Also: అహ్మదాబాద్‌లో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్..

