దోహా నుంచి హాంకాంగ్ వెళ్తున్న ఖతర్ ఎయిర్వేస్(Qatar Airways) విమానం అహ్మదాబాద్‌లో అత్యవసర ల్యాండింగ్ చేసింది. విమానం QR816లో సాంకేతిక లోపం తలెత్తడంతో విమానాన్ని అహ్మదాబాద్‌వైపు మళ్లించారు. విమానంలోని ప్రయాణికులంతా సురక్షితంగా ఉననారు. ప్రస్తుతం విమానం కండిషన్‌ను అధికారులు పరిశీలిస్తున్నారు. ‘‘మధ్యాహ్నం 2:12 గంటల సమయంలో విమానం ల్యాండింగ్‌కు ఓకే చెప్పాం. 2:32 గంటల సమయంలో ల్యాండింగ్ పూర్తయింది. 2:38 గంటలకు ఎమర్జెన్సీని ఉపసంహరించుకున్నాం. విమానాశ్రయం కార్యకలాపాలు యథావిథిగా కొనసాగుతున్నాయి’’ అని సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారిక ప్రతినిధి వెల్లడించారు.

