కలం, వెబ్ డెస్క్: నిత్యం అసెంబ్లీలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ జిల్లా తణుగుల నియోజకవర్గంలో చెక్ డ్యామ్‌ను బాంబులు పెట్టి పేల్చేశారని ఆరోపించారు. గతంలో మేడిగడ్డను బాంబులు పెట్టి పేల్చినట్టే తణుగులలో కూడా పేల్చారని కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది.
కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) వ్యాఖ్యలతో సభలో తీవ్ర గందరగోళం చెలరేగింది. కాంగ్రెస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కౌశిక్ రెడ్డి తెలిసీ తెలియకుండా మాట్లాడుతున్నారని .. సభను తప్పుదోవ పట్టిస్తున్నారని ఫైర్ అయ్యారు.
రాష్ట్రంలో చెక్ డ్యామ్ లను పేల్చేస్తున్నారని చాలా రోజులగా ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. ఇసుక మాఫియా ఈ చెక్ డ్యామ్‌లను పేల్చేస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఈ అంశం మీద విజిలెన్స్ ఎంక్వైరీ కూడా వేసింది.
Read Also: ‘పాలమూరు’పై మీ చేతకానితనాన్ని మాపై రుద్దవద్దు : ఉత్తమ్‌కుమార్ రెడ్డి
Follow Us On: X(Twitter)


