కలం వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు(CM Chandrababu) అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభమైంది. సుమారు 20 అంశాలపై కేబినెట్ మంత్రివర్గం (AP Cabinet Meeting) చర్చించనుంది. మూడు కొత్త జిల్లాలతో పాటు, పలు రెవెన్యూ డివిజన్లకు ఆమోదం తెలపనున్నట్లు తెలుస్తోంది. అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ ప్రాంగణంలో 2 ఎకరాల్లో రూ.103.96 కోట్లతో నిర్మించనున్న రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు ఆమోదం తెలపనున్నారు. దీంతో పాటు పలు కీలక నిర్ణయాలను ఆమోదించనున్నారు. పీపీపీ విధానం గురించి సీఎం చంద్రబాబు మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, మెడికల్ కాలేజీల టెండర్లపై చర్చించనున్నారు.
Read Also: ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ మృతుడి వద్ద భారీ నగదు
Follow Us On: Sharechat


