మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్(Srinivas Goud) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాగంటి సునీతపై తుమ్మల చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఒక ఆడబిడ్డ దుఃఖాన్ని ఎలా హేళన చేయాలనిపించిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మాగంటి సునీత(Maganti Sunitha) చనిపోయిన తన భర్త గుర్తుకు వచ్చి కన్నీరు పెడుతుంటే.. దానిని యాక్షన్ అంటారా? కమ్మ సామాజిక వర్గం మద్దతుతోనే నువ్వు మంత్రి అయ్యావు కదా తుమ్మల నాగేశ్వరరావు.
మరి అదే సామాజిక వర్గానికి చెందిన ఆడబిడ్డ దుఃఖంలో ఉంటే అవమానిస్తావా? మాగంటి గోపినాథ్(Maganti Gopinath) చనిపోయినప్పుడు సునీత ఎంత బాధ పడిందో, మీరు అనే మాటలకు అంతకంటే ఎక్కువ బాధపడుతుంది. ఆమెను అవమానించిన మంత్రులు వెంటనే సునీతకు క్షమాపణలు చెప్పాలి’’ అని డిమాండ్ చేశారు శ్రీనివాస్ గౌడ్. అయితే మాగంటి సునీత.. జూబ్లీహిల్స్(Jubilee Hills)లో కన్నీళ్లు పెట్టి సానుభూతితో గెలవాలని ప్రయత్నిస్తున్నారంటూ తుమ్మల విమర్శించారు. ఇతర మంత్రులు కూడా ఇదే తరహాలో విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ మంత్రులపై శ్రీనివాస్ గౌడ్(Srinivas Goud) ఆగ్రహం వ్యక్తం చేశారు.

