నేటి నుంచి నిజామాబాద్‌లో తీజ్ పండుగ

కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad) నగరంలో 14వ తేదీ నుంచి 24 వరకూ తీజ్ ఉత్సవాలు (Teej Festival) నిర్వహిస్తున్నట్టు ఉత్సవ కమిటీ జేఏసీ వెల్లడించింది. అన్ని శాఖల ప్రభుత్వ ఉద్యోగులు, వైద్యులు, విశ్రాంత ఉద్యోగులు, మహిళలు, కాంట్రాక్టు ఉద్యోగులు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు, స్వయం ఉపాధి రంగాలలో పని చేస్తున్న సోదరులు, యువత, విద్యార్థులు యావత్ బంజారా సమాజం అందరూ JACగా నిర్వహించుకునే సామూహిక బంజారా తీజ్ ఉత్సవాలు విజయవంతం చేయాలని కమిటీ కోరింది. యావత్ నిజామాబాద్ జిల్లా గోర్ బంజారా జాతి బిడ్డలు, ఉద్యోగ విభాగాల ప్రతినిధులు, మహిళలు, యువత బంజారా సమాజానికి చెందిన ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలని సూచించింది.

శుక్రవారం (ఘవు, చణ గాళేరొ) సాయంత్రం గోధుమలు, శనగలు నానబెట్టుట అలాగే ప్రతి రోజు కార్యక్రమాలు, చివరికి 23 (ఆదివారం) మధ్యాహ్నం 3:00 గంటలకు ఆటపాటలతో మహా ముగింపు ర్యాలీ, సాయంత్రం 6:00 గంటల వరకు తీజ్ నిమజ్జన కార్యక్రమం జరుగుతుందని కమిటీ ప్రతినిధులు వివరించారు. తీజ్ ఉత్సవం మన బంజారా సంస్కృతి, సంప్రదాయం ఐక్యతకు ప్రతీక. కావున బంజారా సమాజానికి చెందిన ప్రతి కుటుంబం, యువత, మహిళలు, ఉద్యోగులు, సంఘాల ప్రతినిధులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా తీజ్ ఉత్సవ కమిటీ విన్నవించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>