విధేయులకు పార్టీలో సముచిత స్థానం: శివసేన రెడ్డి

కలం, వనపర్తి: పార్టీ కోసం క్షేత్రస్థాయిలో పనిచేసిన విధేయులకు కాంగ్రెస్‌లో సముచిత స్థానం లభిస్తుందని వనపర్తి జిల్లా డీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్ శివసేన రెడ్డి (Shiva Sena Reddy) అన్నారు. శుక్రవారం పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన జిల్లా ఎగ్జిక్యూటివ్‌ సమావేశంలో ఎమ్మెల్యే మేఘారెడ్డితో కలిసి పాల్గొన్నారు. పార్టీ సంస్థాగత బలోపేతం, క్షేత్రస్థాయిలో కార్యక్రమాల అమలు, కమిటీల పనితీరు, కార్యకర్తల సమన్వయంతో ముందుకు సాగాలని శివసేన రెడ్డి సూచించారు. అధిష్ఠానం ఆదేశాలను పరిగణనలోకి తీసుకుని క్షేత్రస్థాయిలో పనిచేయాలని కోరారు. పార్టీ నూతన జిల్లా కార్యాలయానికి భూమి పూజతో పాటు పలు అంశాలపై సమావేశంలో చర్చించారు.

వారం రోజుల్లో కమిటీల నియామకం..

పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ చురుగ్గా పనిచేయాలని సూచించిన శివసేన రెడ్డి.. సర్ ప్రక్రియలో పనిచేసిన మండల అధ్యక్షులు, ఇన్‌ఛార్జులను అభినందించారు. వారం రోజుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా, యువజన కాంగ్రెస్‌, విద్యార్థి విభాగాలకు సంబంధించిన పూర్తి కమిటీలను ప్రకటిస్తామని తెలిపారు. జిల్లా కాంగ్రెస్‌ ఉపాధ్యక్షులు తిరుపతయ్య, సాయి చరణ్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బ్రహ్మం, మున్సిపల్‌ ఛైర్‌పర్సన్లు మాధవి, శ్రీనివాస్‌గౌడ్‌, అధికార ప్రతినిధి వెంకటేష్‌, జిల్లా కమిటీ సభ్యులు చీర్ల జనార్దన్‌, బి.కృష్ణ, పట్టణ అధ్యక్షుడు రాములు, మండల అధ్యక్షులు రవికిరణ్‌, రామిరెడ్డి, దయాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>