కలం, వెబ్ డెస్క్ : టాలీవుడ్ ఫిలిం ఛాంబర్ (Film Chamber) ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. మొత్తం 44 ఈసీ మెంబర్స్ స్థానాలకు జరిగిన ఈ ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్, మన ప్యానెల్ పోటీపడ్డాయి. ప్రోగ్రెసివ్ ప్యానెల్ ను అల్లు అరవింద్, దిల్ రాజు, సురేష్ బాబు సపోర్ట్ చేయగా.. మన ప్యానెల్ ను చిన్న నిర్మాతలు సపోర్ట్ చేశారు. నేడు పోలింగ్ జరగ్గా.. ఫలితాలు తాజాగా వచ్చేశాయి. ఇందులో ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి ఐదుగురు గెలవగా, మన ప్యానెల్ నుంచి ఏడుగురు గెలిచారు. స్టూడియో సెక్టార్ లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి ఒకరు, మన ప్యానెల్ నుంచి ముగ్గురు గెలిచారు.
డిస్ట్రిబ్యూటర్స్ సెక్టార్ లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి 8 మంది గెలవగా.. మన ప్యానెల్ నుంచి ముగ్గురు మాత్రమే గెలిచారు. ఎగ్జిబిటర్స్ సెక్టార్ లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి 14 మంది గెలిస్తే.. మన ప్యానెల్ నుంచి ఇద్దరు విజయం సాధించారు. మొత్తంగా 44 మంది ఈసీ మెంబర్స్ లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి 28 మంది గెలవగా.. మన ప్యానెల్ నుంచి 15 మంది గెలుపొందారు. దీంతో ఫిలిం ఛాంబర్ (Film Chamber) అధ్యక్ష, ఉపాధ్యక్ష, కార్యదర్శి పదవులు ఈ ప్రోగ్రెసివ్ ప్యానెల్ చేతుల్లోనే ఉండబోతున్నాయి.
Read Also: హీరోయిన్ కు చీర ఇచ్చిన ప్రభాస్..
Follow Us On: X(Twitter)


