కలం, వెబ్ డెస్క్ : ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమంది రవి (IBomma Ravi) కస్టడీలో షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. రవి కస్టడీలో పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నట్టు ఒప్పుకున్నాడు. వాటిని ప్రహ్లాద్ వెల్లేల పేరుతో తీసుకున్నానని.. అతను తన రూమ్ మేట్ అని రవి చెప్పాడు. దీంతో పోలీసులు అనుమానించి ప్రహ్లాద్ ను రప్పించారు. ఈ ప్రహ్లాద్ బెంగుళూరులో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు. ఇమంది రవి ముందే ప్రహ్లాద్ ను ప్రశ్నించారు పోలీసులు. అసలు రవి ఎవరో తనకు తెలియదని.. అతన్ని ఎప్పుడూ చూడలేదని ప్రహ్లాద్ చెప్పాడు. ప్రహ్లాద్ పర్సనల్ డాక్యుమెంట్లను రవి దొంగతనంగా సేకరించాడేమో అని పోలీసులు భావిస్తున్నారు. కస్టడీలో చాలా విషయాలను పోలీసులు బయటకు లాగినట్టు తెలుస్తోంది. రేపటితో రవి (IBomma Ravi) కస్టడీ ముగియబోతోంది. త్వరలోనే ఈ కస్టడీపై నివేదిక ఇవ్వబోతున్నారు పోలీసులు.
Read Also: అమెరికాలో తెలుగు వ్యక్తి స్టార్టప్‌కు బెదిరింపులు
Follow Us On: Instagram


