కలం, యాదాద్రి భువనగిరి : భువనగిరి నియోజకవర్గ రైతుల సాగునీటి అవసరాలకు ప్రాధాన్యత ఇస్తూ బునాదిగాని కాలువపై చేపట్టిన కొత్త బాక్స్ కల్వర్టుల నిర్మాణ పనులు పూర్తికావడంతో, గురువారం బీబీనగర్ మండలం మక్త అనంతారం వద్ద బునాదిగాని కాలువ నీటిని భువనగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి (Kumbam Anil Kumar) విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
రైతులకు సాగునీరు అందించడంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కాలువల అభివృద్ధి, ఆధునీకరణ, అవసరమైన నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేస్తున్నామని అన్నారు. బునాదిగాని కాలువ పరిధిలో నీటి ప్రవాహానికి ఇబ్బందులు కలిగించే ప్రాంతాలను గుర్తించి, వాటికి శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇందులో భాగంగానే కొత్త బాక్స్ కల్వర్టుల నిర్మాణ పనులను పూర్తి చేసి, కాలువ నీటిని విడుదల చేయడం జరిగిందని పేర్కొన్నారు. కాలువ ద్వారా విడుదల చేసిన నీరు చివరి ఆయకట్టు వరకు సక్రమంగా చేరేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆయన (Kumbam Anil Kumar) సూచించారు.
నీటి ప్రవాహంలో ఎక్కడైనా సమస్యలు తలెత్తితే వెంటనే గుర్తించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పిఏసిఎస్ చైర్మన్ పొట్టోల శ్యామ్ గౌడ్, సీనియర్ నాయకులు పంజాల రామాంజనేయులు, గోలి పింగల్ రెడ్డి, గోలి నరేందర్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు సురకంటి సత్తిరెడ్డి, పిఏసిఎస్ వైస్ చైర్మన్, పిఏసిఎస్ డైరెక్టర్లు, మండల నాయకులు, సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు, ఈఈ శైలేందర్, డీఈ లావణ్య పాల్గొన్నారు.
Also Read : కాంగ్రెస్ నిజమైన సెక్యులర్ పార్టీ: సీఎం రేవంత్ రెడ్డి
Follow Us On: Instagram

