కలం, వెబ్ డెస్క్ : ప్రతిపక్షాల మీద బురద జల్లడం కోసమే అసెంబ్లీ సమావేశాలను కాంగ్రెస్ నిర్వహించాలనుకుంటుందని బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించిందని హరీశ్ రావు విమర్శించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత 2014 నుంచి 2019 వరకు ఎక్కువ రోజులు అసెంబ్లీని నడిపించినట్లు హరీశ్ రావు తెలిపారు.
దాదాపు ఒక సెషన్ లో 32 రోజులు సభ సమావేశాలను నిర్వహించామని చెప్పుకొచ్చారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో మొత్తం మీద 40 రోజుల మాత్రమే అసెంబ్లీ పెట్టిందని హరీశ్ రావు విమర్శించారు. సభ నడపాలంటే కాంగ్రెస్ జంకుతుందని.. అసెంబ్లీ సమావేశాలను కచ్చితంగా 15 రోజుల పాటు కొనసాగించాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.
గతంలో కాళేశ్వరం (Kaleshwaram) విషయంలో కేసీఆర్ మాట్లాడుతుంటే ఉత్తమ్ కుమార్రెడ్డి ప్రిపేర్ అయి రాలేదన్నాడని ఎద్దేవా చేశారు. కానీ, తాము మాత్రం సభకు సిద్ధం అయి వస్తున్నామని హరీశ్ రావు తెలిపారు. తాను ఘోష్ కమిషన్ గురించి మాట్లాడుతుంటే ఏడుగురు మంత్రులు అడ్డుకున్నారని.. తాను వాళ్లకు సమాధానం చెప్పాలా? సబ్జెక్ట్ మాట్లాడాలా? అని హరీష్ రావు (Harish Rao) ప్రశ్నించారు.
Read Also: ‘జయా ఆంటీ మాలూమ్ తేరా కో’.. అంటే కుదరదంటోన్న సజ్జనార్
Follow Us On: Sharechat


