రాహుల్ గాంధీ ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే.. డైట్‌పై యూత్‌కి సూచనలు

కలం, వెబ్ డెస్క్: బిజీ షెడ్యూల్‌లోనూ ఫిట్‌గా ఎలా ఉంటున్నారంటూ ఓ యువ ఫాలోవర్ అడిగిన ప్రశ్నకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ఖరీదైన డైట్‌లు, ప్రత్యేకమైన వర్కౌట్‌ల గురించి కాకుండా.. రాత్రి 11 గంటలకు వ్యాయామం చేయాల్సి వస్తే 11 గంటలకే చేస్తానని చెప్పారు. ఫిట్‌నెస్ అంటే సౌకర్యం కోసం ఎదురుచూడటం కాదని, నిరంతరం కొనసాగించడమేనని అభిప్రాయపడ్డారు.

ఫిట్‌నెస్ విషయంలో ప్రేరణ కోసం ఎదురుచూడటం కంటే.. రోజువారీ జీవితంలో ముఖ్యమైన పనిగా భావించాలన్నారు రాహుల్​ గాంధీ (Rahul Gandhi). వ్యాయామంతో పాటు ఆహారపు అలవాట్లు కూడా ఫిట్‌నెస్‌లో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. అనారోగ్యకరమైన ఆహారం, అధికంగా మద్యం సేవించడం, తరచూ స్నాక్స్ తీసుకోవడం లాంటివి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని రాహుల్ గాంధీ ప్రస్తావించారు.

అయితే రాత్రి 11 గంటలకు వ్యాయామం చేయవచ్చా? అంటే.. సాధారణంగా ఆరోగ్యంగా ఉన్నవారికి రాత్రివేళ వ్యాయామం చేయడం సురక్షితమేనని నిపుణులు చెప్తున్నారు. సాయంత్రం శరీర ఉష్ణోగ్రత, కండరాల బలం కొంత ఎక్కువగా ఉండటంతో కొందరు ఆ సమయంలో మెరుగ్గా వ్యాయామం చేయగలుగుతారు. అయితే నిద్రకు ముందు వెంటనే భారీ వర్కౌట్స్​ వల్ల కొందరికి నిద్ర పట్టడంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.

Also Read : పార్టీ మార్పుపై ఎమ్మెల్యే పోచారం సంచలన వ్యాఖ్యలు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>