పార్టీ మార్పుపై ఎమ్మెల్యే పోచారం సంచలన వ్యాఖ్యలు

కలం, వెబ్ డెస్క్: సీనియర్ నేత, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి (Pocharam Srinivas Reddy) పార్టీ మార్పుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను డబ్బు కోసం పార్టీ మారలేదని, నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారానని స్పష్టం చేశారు. నిధుల కోసం ఎవరికి ఫోన్ చేసినా స్పందించడం లేదంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆవేదన వ్యక్తం చేశారు. తాను కాంగ్రెస్ కండువా కప్పుకోలేదని, కేవలం జాతీయ జెండా మాత్రమే కప్పుకున్నానన్నారు. తన నిర్ణయం వెనుక వ్యక్తిగత ప్రయోజనాలు లేవని పేర్కొన్నారు.

కేసీఆర్ హయాంలోనే నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందని ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి (Pocharam Srinivas Reddy) అన్నారు. అన్నం పెట్టినవాళ్లను తాను ఎప్పటికీ మరిచిపోలేనని, తెలిసో తెలియకో కొన్ని పరిస్థితుల్లో పార్టీ మారాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు. నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశారు.

Also Read : రాహుల్ గాంధీ ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే.. డైట్‌పై యూత్‌కి సూచనలు

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>