కలం, వెబ్ డెస్క్ : హీరోయిన్ నిధి అగర్వాల్ మీద యాంకర్ సుమ (Anchor Suma) చేసిన కామెంట్లపై సోషల్ మీడియాలో వివాదం మొదలైంది. మొన్న నటుడు శివాజీ హీరోయిన్ల బట్టలపై చేసిన కామెంట్లు ఎంత పెద్ద రచ్చకు దారి తీశాయో మనం చూశాం కదా. శివాజీ కామెంట్లపై హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా సీరియస్ అయింది. అయితే నిన్న ది రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిధి అగర్వాల్ చీరలో మెరిసింది. వేదిక మీద మాట్లాడిన తర్వాత కిందకు దిగుతుంటే యాంకర్ సుమ నిధి చీరపై కామెంట్ చేసింది.
‘నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) చీరలోనే నిధులన్నీ ఉన్నట్టున్నాయి’ అంటూ మాట్లాడింది. ఇంకేముంది ఈ కామెంట్లపై సోషల్ మీడియాలో నానా రచ్చ జరుగుతోంది. నిండుగా బట్టలు వేసుకోమని చెబితే శివాజీని అన్ని మాటలు అన్నారు కదా.. మరి ఇప్పుడు యాంకర్ సుమ మాట్లాడింది తప్పు కాదా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు నిధి అగర్వాల్ సుమను (Anchor Suma) క్వశ్చన్ చేస్తుందా అని కామెంట్లు పెడుతున్నారు. అయితే ఇంకొందరు మాత్రం సుమను సపోర్ట్ చేస్తున్నారు. సుమ మాట్లాడింది నిధి అగర్వాల్ చీర డిజైన్ గురించి అని.. ఆమె చీరలో డైమండ్స్ ఉండటం వల్లే ఆ ఉద్దేశంతో కామెంట్ చేసిందని ఆన్సర్ ఇస్తున్నారు. ఇలా యాంకర్ సుమ కామెంట్లపై వాదనలు మొదలయ్యాయి. మరి దీనిపై సుమ ఏమైనా స్పందిస్తుందా లేదా చూడాలి.
Read Also: అందుకే రూ.40కోట్ల ఆఫర్ వదులుకున్నా: సునీల్ శెట్టి
Follow Us On: Sharechat


