కలం వెబ్ డెస్క్ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ఆదివారం పశ్చిమ గోదావరి (West Godavari) జిల్లా నరసాపురంలోని పెదమైనవానిలంకలో పర్యటించారు. ఈ గ్రామాన్ని పదేళ్ల క్రితం నిర్మలా సీతారామన్ దత్తత తీసుకున్నారు. స్థానిక పాఠశాలలో యూనియన్ బ్యాంక్ సహకారంతో ఏర్పాటు చేసిన రూ.18 లక్షల విలువైన సైన్స్, కంప్యూటర్ ల్యాబ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నిర్మలాసీతారామన్ మాట్లాడారు. స్థానిక ప్రజలు తమ ఇంటి కూతురు తిరిగి వస్తే స్వాగతించినట్లు ఆహ్వానించారని సంతోషం వ్యక్తం చేశారు. విద్య ఒక్కటే అభివృద్ధికి రాజమార్గమని, బాగా చదువుకోవాలని విద్యార్థులకు సూచించారు.
స్థానిక మత్స్యకారులకు ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రభుత్వం పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అభివృద్ధిలో దూసుకుపోతున్నామన్నారు. ఈ ప్రాంతాన్ని ఇంకా ఎలా అభివృద్ధి చేయాలన్న విషయాలు ప్రభుత్వాల దృష్టికి తీసుకురావాలని చెప్పారు. ప్రపంచంలో సంస్థలన్నీ మానవ వనరులను తగ్గించి ఏఐతో కార్యకలాపాలు చేస్తున్నాయని, దీనిపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. గ్రామాల్లో డ్రోన్లను వినియోగించి ఎరువులు వినియోగించడం, విత్తనాలు విత్తనాలు విత్తడం వంటి పనులు నిర్మల సీతారామన్(Nirmala Sitharaman) చేయాలన్నారు.
Read Also: సహకార సొసైటీలకు నామినేటెడ్ పోస్టులు
Follow Us On: Instagram


