జూబ్లీహిల్స్‌లో గెలవడం కోసం కాంగ్రెస్.. దొంగ ఓట్లకు కూడా తెరలేపుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తీవ్ర ఆరోపణలు చేశారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక దగ్గర పడుతున్న కొద్దీ.. నియోజకవర్గ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అన్ని పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచాయి. ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలను సంధించుకున్నారు. ఇందులో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(Jubilee Hills Bypoll)లో కాంగ్రెస్‌కు ఛాన్స్ లేదని తెలియడంతో వారు దొంగ ఓట్లు వేయించడానికి కూడా రెడీ అయ్యారని ఆరోపించారు. అందులో భాగంగానే ఒకే ఇంట్లో 43 దొంగ ఓట్లను చేర్చారని విమర్శించారు.
‘‘గతంలో కాంగ్రెస్ తరుఫున జూబ్లీహిల్స్‌లో అజారుద్దీన్ పోటీ చేశారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఇస్తానని ఆయనని పక్కనబెట్టారు. జూబ్లీహిల్స్ ఓటర్లు పంచ్ కొడితే దెబ్బ కాంగ్రెస్ హైకమాండ్‌కు తగలాలి. కారు కావాలా.. బుల్డోజర్ కావాలా అనేది ఓటర్లే తేల్చుకోవాలి. కాంగ్రెస్ నేత ఒకే ఇంట్లో 43 దొంగ ఓట్లు చేర్చింది. అలాంటివి ఎదర్కోవడంపై పార్టీ పరంగా దృష్టి సారించాం’’ అని కేటీఆర్(KTR) చెప్పారు.
Read Also: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నోటిఫికేషన్ విడుదల..

