కలం వెబ్ డెస్క్ : గత జూన్‌లో సంగారెడ్డి(Sangareddy) జిల్లాలోని సిగాచీ పరిశ్రమ(Sigachi Industries)లో పేలుడు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కంపెనీ సీఈవో(CEO)ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. జూన్ 30న సిగాచీ పరిశ్రమలో పేలుడు జరిగింది. ఈ ఘటనలో 54 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 8 మంది గల్లంతయ్యారు. ఈ ఘటనతో పోలీసులు కంపెనీ యాజమాన్యంపై కేసు నమోదు చేసుకొని అప్పట్లోనే విచారణ ప్రారంభించారు. తాజాగా కంపెనీ సీఈవో అమిత్ రాజ్ సిన్హను శనివారం రాత్రి అరెస్ట్ చేశారు. ఈ కేసులో అమిత్ ఏ2గా ఉన్నారు. కాగా, ఇదంతా పోలీసులు అత్యంత గోప్యంగా జరుపుతున్నట్లు తెలుస్తోంది.
Read Also: క్లీన్ సిటీ కోసం ‘మెగా డ్రైవ్’.. రేపటి నుంచే ప్రారంభం
Follow Us On: X(Twitter)


