epaper
Friday, January 16, 2026
spot_img
epaper

ముఖానికి ముసుగు.. తాళ్లతో కట్టేసిన చేతులతో గ్యాంగ్​స్టర్​ నామినేషన్​

కలం, వెబ్​డెస్క్​: ‘అసెంబ్లీ రౌడీ’ మూవీలో మోహన్​బాబు జైలు నుంచే నామినేషన్ వేసి, ఎన్నికల్లో గెలిచే సీన్​ చాలామందికి గుర్తుండే ఉంటుంది. అది సినిమా. కానీ, అంతకుముందు ఆ తర్వాత కూడా చాలా మంది జైలు నుంచి నామినేషన్లు వేశారు. కొందరు గెలిచారు కూడా. చేయని తప్పునకు అక్రమంగా జైలుపాలైన వాళ్ల సంగతి సరే. చాలా మంది నేరస్థులు, గ్యాంగ్​స్టర్లు జైలు నుంచి నామినేషన్​ వేయడం మామూలైపోయింది. ఇలాంటిదే ఇప్పుడు పుణె (Pune) కార్పొరేషన్​ ఎన్నికల్లో చోటుచేసుకుంది. ఈ నెల 28న జరగనున్న పుణె కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు గ్యాంగ్​స్టర్​ బందు అందేఖర్​​ శనివారం నామినేషన్ (Gangster Nomination)​ దాఖలు చేశాడు.

ఈ సందర్భంగా ముఖానికి నల్లటి ముసుగు వేసి, చేతులను తాళ్లలతో కట్టేసిన నిందితుని పోలీసులు నామినేషన్ (Gangster Nomination)​ కేంద్రానికి తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్​ మీడియాలో వైరలయ్యాయి. కాగా, సొంత మనువడు అయిన ఆయుష్​ను సెప్టెంబర్​ 5న తుపాకీలతో కాల్చి దారుణంగా హత్య చేసిన కేసులో అందేఖర్​తోపాటు అతని కుటుంబంలోని మరో 15 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం వీళ్లు పోలీసుల కస్టడీలో ఉన్నారు. ఈ క్రమంలో పుణె ఎన్నికల్లో కార్పొరేటర్​గా పోటీ చేసేందకు అందేఖర్​తోపాటు అతనితో కలసి జైలులో ఉన్న మరో ఇద్దరు మహిళలు ఇండిపెండెంట్లుగా నామినేషన్​ వేశారు. వీళ్లు నామినేషన్​ వేయడానికి వచ్చేటప్పుడు చేతులూపుతూ, నినాదాలు చేస్తూ వస్తున్న వీడియోను సోషల్​ మీడియాలో చూసి, నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

Read Also: క్లీన్ సిటీ కోసం ‘మెగా డ్రైవ్’.. రేపటి నుంచే ప్రారంభం

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>