కలం వెబ్ డెస్క్ : నేడు ఉదయం 8 గంటలకు ప్రారంభమైన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు(Film Chamber) ముగిశాయి. ఈ ఎన్నికల్లో టాలీవుడ్(Tollywood) ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. నటులు రాజేంద్రప్రసాద్, నాని, సుధీర్ బాబు, నరేష్, శివాజీ, డైరెక్టర్ మారుతి, పోసాని కృష్ణమురళి తదితరులు ఓటు వేశారు. ఎన్నికలు ప్రారంభమైనప్పటి నుంచే నిర్మాతలు సి.కళ్యాణ్, నాగవంశీ, డైరెక్టర్ వైవీఎస్ చౌదరి తదితరులు అక్కడే ఉన్నారు.
ప్రకాశ్ రాజ్, దిల్‌రాజు, అల్లు అరవింద్, శ్యాంప్రసాద్ కూడా ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో (Film Chamber) పాల్గొన్నారు. ప్రొడ్యూసర్, ఎగ్జిబ్యూటర్, స్టూడియో, డిస్ట్రిబ్యూటర్ విభాగాల్లో మొత్తంగా 3,355 ఓట్లు ఉన్నాయి. నేటి ఎన్నికల్లో 11,00 ఓట్లు పోలయ్యాయి. సాయంత్రం 4 గంటల వరకు కౌంటింగ్ ప్రారంభించనున్నారు. సుమారు 6 గంటలకు ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. ఈసారి ఎగ్జిబ్యూటర్ సెక్టార్ నుంచి అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు.
Read Also: శివాజీ వ్యాఖ్యలపై కేఏ పాల్ రియాక్షన్.. బాలకృష్ణపై చర్యలెందుకు తీసుకోలేదని ఫైర్
Follow Us On : WhatsApp


