టాలీవుడ్ స్టైలిష్ విలన్ జగపతి బాబుకు మహానటి కీర్తి సురేష్(Keerthy Suresh) సారీ చెప్పింది. ఒక్కసారిగా కీర్తీ.. సారీ చెప్పడంతో ఈ అంశం వైరల్ అయింది. అసలు విషయం ఏంటంటే.. జగపతి బాబు హోస్ట్‌గా నిర్వహిస్తున్న టాక్ షో.. ‘జయమ్ము నిశ్చయమ్మురా’. ఆ షోకు అనేక మంది సెలబ్రిటీలు వస్తున్నారు. చాలా ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కీర్తీ సురేష్.. ఈ షోకు వచ్చింది. ఈ సందర్భంగానే జగపతి బాబుకు క్షమాపణ చెప్పింది. ఈ షోలో అనేక విషయాలు చెప్పిన కీర్తి.. తన పెళ్ళి గురించి మాట్లాడింది. తన పెళ్ళికి జగపతి బాబు(Jagapathi Babu)ను పిలవలేకపోయానని, అందుకు సారీ అని చెప్పింది. ‘‘పెళ్లి జరిగే వరకు నా ప్రేమ గురించి చాలా తక్కువ మందికి చెప్పాను. నేను మిమ్మల్ని నమ్మాను కాబట్టే.. నా వ్యక్తిగత విషయాలను పంచుకున్నాను. కానీ.. పెళ్ళికి పిలవలేకపోయాను.. క్షమించండి’’ అని వివరించింది.
‘‘ఇంట్లో వాళ్లు అంగీకరించిన తర్వాతే పెళ్లి చేసుకోవాలని నేను, ఆంథోనీ నిర్ణయించుకున్నాం. 15 ఏళ్లుగా మేము ప్రేమలో ఉన్నాం. తను ఆరు సంవత్సరాలు ఖతర్‌లో ఉన్నాడు. నేను ఇండియాలో ఉన్నాను. అక్కడినుంచి వచ్చాక ఇంట్లో చెప్పాలనుకున్నాం. నాలుగేళ్ల క్రితమే మా విషయాన్ని ఇంట్లో చెప్పాం. మా నాన్న వెంటనే అంగీకరించారు. ఇంట్లో చెప్పడం కంటే ముందే మీకు చెప్పా’’ అని కీర్తి(Keerthy Suresh) తెలిపారు.
Read Also: బీపీడీతో జాగ్రత్త.. దీని ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా..?

