కలం, సినిమా : మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘ఇరుముడి’ (Irumudi). టాలెంటెడ్ డైరెక్టర్ శివ నిర్వాణ (Shiva Nirvana) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా చిత్రబృందం ఈ మూవీ ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించింది. ఆగస్టు 12న ‘ఇరుముడి’ ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. భీమవరంలోని SRKR ఇంజినీరింగ్ కాలేజీలో ట్రైలర్ గ్రాండ్ లాంచ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు తెలిపారు.
“కుటుంబమే సర్వస్వం అయినప్పుడు.. వారి కోసం ఒక మనిషి ఏమైనా చేస్తాడు” అనే ఆసక్తికరమైన లైన్‌తో ట్రైలర్ ప్రకటనను విడుదల చేశారు. దీంతో ఈ సినిమాలో కుటుంబం చుట్టూ సాగే భావోద్వేగ కథతో పాటు మాస్ ఎలిమెంట్స్‌కు ప్రాధాన్యం ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, టీ-సిరీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 2026 ఆగస్టు 21న ‘ఇరుముడి (Irumudi)’ సినిమా గ్రాండ్ రిలీజ్ కానుంది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ భీమవరంలో జరగనుండటంతో అభిమానులలో ఆసక్తి మరింత పెరిగింది.
Also Read : ఆష్లి గార్డనర్ వైస్ కెప్టెన్సీకి ముప్పు.. భార్య సంచలన వ్యాఖ్యలు
Follow Us On : WhatsApp

