ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి: ఎస్పీ

కలం, నిర్మల్: పోలీస్ సిబ్బంది విధులతో పాటు ఆరోగ్య పరిరక్షణకు ప్రతిరోజూ కొంత సమయం కేటాయించాలని జిల్లా ఎస్పీ జానకి షర్మిల (SP Janaki Sharmila) అన్నారు. శనివారం నిర్మల్ జిల్లా పోలీస్ ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో సివిల్, ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ సిబ్బందికి నిర్వహించిన వీక్లీ పరేడ్‌లో ఆమె పాల్గొని గౌరవ వందనం స్వీకరించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసులకు క్రమశిక్షణతో పాటు శారీరక దృఢత్వం ఎంతో ముఖ్యమన్నారు. చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఏమైనా సమస్యలు ఎదురైతే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు.

విధి నిర్వహణతో పాటు కుటుంబానికి తగిన సమయం కేటాయిస్తూ మానసిక ప్రశాంతతను కాపాడుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఉపేందర్‌రెడ్డి, డీఎస్పీ శ్రీనివాస్, సీఐలు మల్లేష్, గోవర్ధన్‌రెడ్డి, కృష్ణ, సమ్మయ్య, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>