epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నోటిఫికేషన్ విడుదల..

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(Jubilee Hills Bypoll) నోటిఫికేషన్ అధికారులు సోమవారం విడుదల చేవారు. షేక్‌పేట తహశీల్దార్ ఆఫీసులో నామినేషన్లను స్వీకరించనున్నట్లు తెలిపారు. నామినేషన్ల స్వీకరణ అక్టోబర్ 21 వరకు కొనసాగనుందని, అభ్యర్థులంతా కూడా ఆ లోపు నామినేషన్లు వేసుకోవచ్చని వివరించారు. అక్టోబర్ 22న నామినేషన్ల పరిశీలన జరుగుతుందని, 24 వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చని అధికారులు నోటిఫికేషన్ లో వెల్లడించారు. నవంబర్ 11న ఎన్నిక జరగనుంది, నవంబర్ 14న ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతుందని వెల్లడించారు. కాగా, నామినేషన్లను సెలవు రోజులు మినహా మిగిలిన రోజుల్లో కార్యాలయంలోనే కాకుండా డిజిటల్ రూపంలో కూడా దాఖలు చేసే అవకాశం ఈసారి అధికారులు కల్పించారు.

బీఆర్ఎస్ నేత మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉపఎన్నిక(Jubilee Hills Bypoll) అనివార్యమైంది. మూడు సార్లు ఆ నియోజకవర్గంలో ఆయన వరుసగా గెలిచారు. కాగా ఇప్పుడు ఉపఎన్నికలో బీఆర్ఎస్ తరుపున గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత పోటీకి సిద్ధమయ్యారు. అదే విధంగా కాంగ్రెస్ తరుపున నవీన్ యాదవ్ బరిలోకి దిగుతున్నారు. బీజేపీ తన అభ్యర్థిని ఇంకా ప్రకటించాల్సి ఉంది.

Read Also: తెలంగాణ బీసీ జేఏసీ ఏర్పాటు.. ఛైర్మన్ ఆయనే..

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>