సీఎం విజయ్-సంగీత విడాకుల కేసులో కీలక మలుపు..!

కలం, వెబ్ డెస్క్ : తమిళనాడు సీఎం, ప్రముఖ నటుడు విజయ్, ఆయన భార్య సంగీత (CM Vijay – Sangeetha) విడాకుల కేసులో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. విజయ్ భార్య సంగీత తాను దాఖలు చేసిన విడాకుల కేసును పూర్తిగా వెనక్కి తీసుకున్నారు. దీంతో కొంతకాలంగా నడుస్తున్న ఈ వివాహ రద్దు కేసును ముగుస్తున్నట్లు చెంగల్పట్టు జిల్లా ధర్మాసనం తీర్పు వెలువరించింది.

ఇదిలాఉంటే గత కొన్నేళ్లుగా నెలకొన్న మ‌న‌స్ప‌ర్థ‌ల‌తో విజయ్ నుంచి విడాకులు కావాలని 2025 డిసెంబర్ లో సంగీత చెంగ‌ల్ప‌ట్టులోని ఫ్యామిలీ కోర్టును ఆశ్ర‌యించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ ఇష్యూ  హాట్ టాపిక్‌గా మారింది. విజ‌య్ త‌న‌ను కొన్నేళ్లుగా ప‌ట్టించుకోవ‌డం లేద‌ని, ఇంట్లో కూడా ఉండ‌నివ్వ‌డం లేద‌ని ఆరోపిస్తూ ఆమె విడాకులకు అప్లై చేశారు. అంతేకాదు 2021 నుంచి విజయ్ తన సహనటితో రిలేషన్‌లో ఉన్నారని ఆమె తన పిటిషన్‌లో ఆరోపించినట్లు ప్రచారం జరిగింది.

ఈ నేపథ్యంలోనే విజయ్ తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వేడుకకు సంగీత, ఆమె పిల్లలు ఎక్కడా కనిపించలేదు. అయితే చెంగల్పట్టు జిల్లా కోర్టులో నేడు జరిగిన విడాకుల కేసు విచారణలో తన పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు సంగీత ప్రకటించడం గమనార్హం. దీంతో గత కొంతకాలంగా రాజకీయ, సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన విజయ్ విడాకుల అంశం సద్దుమణిగినట్లైంది. ఈ క్రమంలోనే విజయ్, సంగీత (CM Vijay – Sangeetha) జంట మళ్లీ ఒకటి కాబోతున్నారనే అంశం విజయ్ అభిమానుల్ని ఖుషీ చేస్తోంది.

Also Read : వందేమాతరానికి చట్టపరమైన రక్షణ

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>