కస్టమర్లలా నటించి.. క్షణాల్లో బంగారం చోరీ

కలం, వెబ్ డెస్క్: వికారాబాద్ జిల్లా తాండూరు (Tandur)లోని ఓ జ్యువెల్లరీ షాపులో దొంగతనం జరిగింది. బంగారం కొనుగోలు చేయాలంటూ అయిదుగురు వ్యక్తులు షాపులోకి వచ్చారు. ఆభరణాలు చూపించాలంటూ షాపు యజమానులను మాటల్లో పెట్టారు. ఇదే సమయంలో మరో ముగ్గురు వ్యక్తులు లోపలి వరకు వెళ్లి.. ఆభరణాలు చూస్తున్నట్లు నటించారు. యజమానులు గమనించడం లేదని భావించిన ఓ మహిళ.. అమాంతం పది గ్రాముల బంగారు గొలుసును అపహరించి బ్యాగులో పెట్టేశారు.

అనంతరం క్షణాల్లో అక్కడి నుంచి అంతా జారుకున్నారు. కొద్దిసేపటి తరువాత బంగారు గొలుసు చోరీ అయినట్లు గుర్తించిన యజమానులు.. సీసీ టీవీ కెమెరాలు పరిశీలించగా అసలు విషయం బయటపడింది. దీంతో వెంటనే తాండూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చోరీ చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>