గాల్లో ఎగిరే విద్యుత్ వాహనం: ఉత్తరాఖండ్‌ కుర్రాడి సంచలనం!

కలం, వెబ్ డెస్క్ : ఉత్తరాఖండ్ రాష్ట్రం అల్మోడా జిల్లా కాఫ్లీఖాన్ గ్రామానికి చెందిన యువ ఆవిష్కర్త రవి టామ్టా సరికొత్త సాంకేతిక సంచలనం సృష్టించారు. ఆయన నిర్మించిన హ్యాపిడా స్కై ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ద్వారా ‘హ్యాపిడా స్కైలెక్స్’ (HAPIDA SKYNeX) అనే ఎలక్ట్రిక్ పర్సనల్ ఫ్లయింగ్ వాహన నమూనాను విజయవంతంగా పరీక్షించారు.

ఏళ్ల తరబడి సాగించిన పరిశోధనల ఫలితంగా రూపుదిద్దుకున్న ఈ వాహనం భవిష్యత్తు రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది. కొండ ప్రాంతాల్లో వేగవంతమైన ప్రయాణానికి, పర్యాటకాభివృద్ధికి, విపత్తుల సమయంలో అత్యవసర సహాయం అందించడానికి ఇది ఎంతగానో ఉపకరిస్తుంది. ఎలాంటి మద్దతు లేకపోయినా స్వశక్తితో కొండంత పట్టుదలతో సాధించిన ఈ ఘనత గ్రామీణ భారత ప్రతిభకు నిదర్శనంగా నిలిచింది.

Also Read : గుజరాత్‌లో మిస్టరీ బావి.. కదులుతున్న నీరు!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>