భారతీయ సంస్కృతిలో చేనేత కళ కీలక భాగం: సీఎం చంద్రబాబు

కలం, వెబ్ డెస్క్: భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో చేనేత కళ కీలక భాగమని సీఎం చంద్రబాబు (CM Chandrababu) స్పష్టం చేశారు. బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గం కొత్తపేటలో ఏర్పాటు చేసిన ‘నేతన్నల సేవలో’ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. చేనేత కళకు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందని.. దేశం గర్వించే కళల్లో చేనేత కళ ఒకటి అని అభిప్రాయపడ్డారు. అధికారంలో ఉన్నా లేకున్నా రాష్ట్రంలోని చేనేత కార్మికులు ఎల్లప్పుడూ టీడీపీ వైపే ఉన్నారని చెప్పారు. చేనేత రంగాన్ని, నేత కార్మికుల కుటుంబాలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని చెప్పారు.

రూ.2.50 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్..

రాష్ట్రాన్ని పునః నిర్మిస్తామని హామీ ఇచ్చామని.. అధికారంలో వచ్చాక ఆ హామీ దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం వివరించారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్యం దృష్ట్యా సంజీవనీ హెల్త్ ప్రాజెక్టుని కొద్ది రోజుల్లో తీసుకువస్తున్నామని.. ఈ పథకాన్ని రాష్ట్రమంతటా అమలు చేసేలా కార్యాచరణ మొదలుపెట్టామన్నారు. పేద ప్రజలందరికీ యూనివర్సల్ గా రూ.2.50 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ చేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతానని ప్రకటించారు. రోడ్లు, పోర్టులు, విమానాశ్ర‌యాలు క‌ట్టి ఎక్క‌డిక‌క్క‌డ లాజిస్టిక్ హ‌బ్‌గా ఏపీని త‌యారు చేస్తామన్నారు.

అనేక ప్రాంతాలు ఫేమస్..

తరతరాలుగా తమ నైపుణ్యంతో అద్భుతమైన వస్త్రాలను నేత కార్మికులు తయారు చేస్తున్నారని సీఎం కొనియాడారు. చేనేత కళాకారుల సృజనాత్మకత, నైపుణ్యానికి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉందన్నారు. మన రాష్ట్రంలోని నేతన్నలు అద్భుత ప్రతిభతో అగ్గిపెట్టెలో పట్టే చీరను తయారు చేశారని.. ఇది చేనేత కళాకారుల ప్రతిభకు నిదర్శనమని అన్నారు. ఇలాంటి అద్భుతమైన నైపుణ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు చేనేత ఉత్పత్తులకు ఫేమస్ అని చెప్పుకొచ్చారు.

చేనేతల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది..

రాష్ట్రంలో చేనేత కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి సీఎం (CM Chandrababu) స్పష్టం చేశారు. చేనేతలకు సబ్సిడీపై విద్యుత్ అందిస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకుందని అన్నారు. చేనేత వృత్తిలో విద్యుత్ వినియోగం కీలకమైన అంశమని తెలిపారు. విద్యుత్ ఖర్చులు తగ్గితే నేతన్నలపై ఆర్థిక భారం కొంతమేర తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. చేనేత కార్మికులకు 50 ఏళ్లకే పింఛన్ అందిస్తున్నామని చెప్పారు. చేనేత వృత్తిని కొనసాగించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, ఆర్థిక సహాయం, మార్కెట్ అవకాశాలు అందించాల్సిన అవసరం ఉందన్నారు. చేనేత ఉత్పత్తులకు మంచి మార్కెట్ లభిస్తే నేతన్నల ఆదాయం పెరుగుతుందని తెలిపారు. తద్వారా యువత కూడా ఈ సంప్రదాయ వృత్తి వైపు ఆకర్షితులయ్యే అవకాశం ఉంటుందన్నారు.

Also Read : గాల్లో ఎగిరే విద్యుత్ వాహనం: ఉత్తరాఖండ్‌ కుర్రాడి సంచలనం!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>