కలం, దేవరకొండ: మహిళల ఆర్థిక స్వావలంబన, సామాజిక అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని దేవరకొండ ఎమ్మెల్యే (Devarakonda MLA) నేనావత్ బాలు నాయక్ (Nenavath Balu Naik) స్పష్టం చేశారు. నల్లగొండ (Nalgonda) జిల్లా కొండమల్లేపల్లి మండల పరిధిలోని గౌరీకుంట తండా, గుడితండా గ్రామాల్లో రూ.10 లక్షల చొప్పున మొత్తం రూ. 20 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన మహిళా సమాఖ్య భవనాలను సంబంధిత అధికారులతో కలిసి శుక్రవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా మహిళా సంఘాల సభ్యులకు శుభాకాంక్షలు తెలిపిన అనంతరం ఎమ్మెల్యే బాలు నాయక్ (Devarakonda MLA) మాట్లాడారు. మహిళా సమాఖ్యలకు సొంత భవనాలు అందుబాటులోకి రావడం వల్ల సంఘ సమావేశాలు, పొదుపు-రుణాల నిర్వహణ, శిక్షణా కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన సదస్సులు నిర్వహించుకోవడానికి ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపారు. ఈ భవనాలు మహిళల ఐక్యతకు, గ్రామాభివృద్ధిలో వారి భాగస్వామ్యానికి వేదికలుగా నిలుస్తాయని అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం మహిళా సాధికారతకు (Women Empowerment) అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ‘మహాలక్ష్మి’ పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో పాటు స్వయం సహాయక సంఘాల బలోపేతం, వడ్డీ లేని రుణాలు, బ్యాంకు లింకేజీ, స్వయం ఉపాధి శిక్షణల ద్వారా గ్రామీణ మహిళల ఆర్థిక ప్రగతికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. మహిళా సంఘాల వ్యాపార, మార్కెటింగ్, ఉపాధి అవసరాల కోసం ప్రభుత్వం ద్వారా త్వరలోనే ఒక బస్సును మంజూరు చేయించేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
ప్రారంభోత్సవ కార్యక్రమంలో దేవరకొండ మార్కెట్ కమిటీ చైర్మన్ నాయిని జమున మాధవరెడ్డి, పీఎసీఎస్ చైర్మన్ వేణుధర్ రెడ్డి, మండల అధ్యక్షుడు కాసర్ల వెంకటేశ్వర్లు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఊట్కూరి వేమన్ రెడ్డి, కొండమల్లేపల్లి సర్పంచ్ పసునూరి యుగంధర్ రెడ్డి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు రామావత్ సరస్వతి-రవి, స్థానిక సర్పంచ్ నేనావత్ కృష్ణ, మాజీ ఎంపీపీ మేకల శ్రీనివాస్ యాదవ్, ఉప సర్పంచ్లు వాంకుడావత్ డాకు, రామావత్ చంటి, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు భూతరాజు ప్రేమలత, ఏపీఎం యాదయ్య, వివోఏ రమావత్ స్వామిలతో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, బంజారా సంఘాలు, మహిళా సంఘాల సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Also Read : మిట్టె జలపాతం.. ప్రకృతి ఒడిలో భూతల స్వర్గం!
Follow Us On: Sharechat

