కలం, వెబ్ డెస్క్ : సంగారెడ్డి(Sangareddy)లో భారీ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న టిప్పర్ ను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది (RTC bus accident). ఈ ప్రమాదంలో 22 మంది ప్రయాణికులకు గాయాలయినట్లు సమాచారం. మెదక్ నుంచి పటాన్ చెరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు సంగారెడ్డి జిల్లా కంది దగ్గర NH 65పై ఆగి ఉన్న టిప్పర్ లారీని వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న 22 మంది కి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు హుటాహుటిన సంగారెడ్డి జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది.
Read Also: ఆపరేషన్ ఆఘట్ 3.0.. ఢిల్లీలో 331 మంది అరెస్ట్
Follow Us On: Instagram


