కలం, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ పార్టీకి కమ్యూనిస్టు లీడర్, సీపీఎం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (MLA Kunamneni Sambasiva Rao) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎన్నికల పోత్తులో భాగంగా తాము స్నేహ ధర్మం పాటిస్తున్నమని చెప్పారు. కానీ, కాంగ్రెస్ పాటించడంలేదని ఆరోపించారు.
స్నేహ ధర్మాన్ని కాపాడకపోతే మిమ్మల్ని రక్షించే వాళ్లే ఉండరూ అని చెప్పారు. తాము పెద్ద పదవులు అడగడం లేదని పొత్తులో ఇచ్చిన హామీల మేరకే పదవులు కోరుతున్నామని వెల్లడించారు. తమను అవమానిస్తే బీఆర్‌స్ కు పట్టిన గతే కాంగ్రెస్ పార్టీకి పడుతుందని కూనంనేని (MLA Kunamneni) కీలక వ్యాఖ్యలు చేశారు.
‘మీ పతనాన్ని మీరే రాసుకుంటే.. మీ నాశనానికి శిలాఫలకం వేసుకుంటే మేమేం చేయలేం’ అని స్పష్టం చేశారు. తమను పట్టించుకోకుండా కమ్యూనిస్టులది ఏముందిలే అని మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తాం అని ఎమ్మెల్యే కూనంనేని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
రాష్ట్రంలో బీజేపీ లాంటి మతోన్మాద పార్టీ రాకూడదనే కాంగ్రెస్ కు సపోర్ట్ చేసినట్లు ఆయన తెలిపారు. పినపాకలో పోటీ చేయాల్సి వస్తే సీపీఐ సిద్ధంగా ఉందని కూనంనేని స్పష్టం చేశారు. కాగా, సీపీఐ ఎమ్మెల్యే వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారాయి.
Also Read : గుజరాత్‌లో మిస్టరీ బావి.. కదులుతున్న నీరు!
Follow Us On : WhatsApp

