కలం, కరీంనగర్: తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమ దిక్సూచి ప్రొఫెసర్ జయశంకర్ (Prof Jayashankar) అని బీజేపీ జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం కొనియాడారు. కరీంనగర్ (Karimnagar) లో బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో గురువారం ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టవర్ సర్కిల్లోని ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్ద బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం, బీజేపీ నాయకులు, కార్యకర్తలు కలిసి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సాయిని మల్లేశం మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ జీవితాంతం పడిన తపన, అందించిన మార్గదర్శకత్వం ఎప్పటికీ మరువలేనివని కొనియాడారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను చివరి వరకు నరనరాన జీర్ణించుకుని, యువతను, విద్యార్థులను ఉద్యమం వైపు నడిపించిన గొప్ప సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ అని తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ కలలుగన్న సామాజిక తెలంగాణ సాధన కోసం, ఆ దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ప్రొఫెసర్ జయశంకర్ (Prof Jayashankar) చూపిన బాటలో నడవడమే ఆయనకు నిజమైన నివాళి అని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిల రమేష్, కార్పొరేటర్ వంగల పవన్, వాసల రమేష్, చంద్రశేఖర్, జితేందర్, కో ఆప్షన్ బల్విందర్ సింగ్, కన్నె కృష్ణ, కటకం లోకేష్, గొట్టిముక్కుల రమణ, నాంపల్లి శ్రీనివాస్, బంగారు రాజేంద్రప్రసాద్, గుజ్జేటి శివ, ఉప్పరపెల్లి శ్రీనివాస్, ఆడిచర్ల రాజు, తనుకు సాయికృష్ణ, పాదం శివరాజ్, దేవరకొండ అజయ్, తదితరులు పాల్గొన్నారు.
Also Read : యూపీఐ చెల్లింపులపై ఛార్జీల బిల్లుకు లోక్సభ ఆమోదం
Follow Us On : WhatsApp

